11 March, 2026 | 8:30 PM

4 నుంచి ఎప్‌సెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్

04-11-2024 02:29 AM

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): ఈనెల 4వ తేదీ నుంచి ఎప్‌సెట్ బైపీసీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసు కోవాలని, 5న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలన్నారు. ఈనెల 9న లేదా అంతకంటే ముందు అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. మిగతా వివరాలకు టీజీఎప్‌సెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.