అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
కలెక్టర్ బదావత్ సంతోష్
మంచిర్యాల, జూన్ 8 (విజయక్రాంతి) : జిల్లా క్రీడాకారులు మంతి ప్రతిభ కనబరు స్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతో ష్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యా డ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌తో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ క్రీడల్లో పాల్గొనేవారు ఉత్సాహంగా ఉంటారని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు.
అనంతరం జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ర్యాం కింగ్ టోర్నమెంటులో ప్రతిభ కనబర్చి జాతీ య స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన ఎనిమిది మంది క్రీడాకారులను, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను మెమెంటోలు అందజేసి సత్కరించారు. కాసేపు క్రీడాకారులతో కలిసి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, చీఫ్ అడ్వయిజర్ గాజుల ముఖేష్ గౌడ్, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రమేష్ రెడ్డి, మధు, కార్యవర్గ సభ్యులు పళ్లెం రాయలింగు, కృష్ణ, లక్ష్మీనారాయణ, కోచ్ నరేం దర్, అకాడమీ బాధ్యుడు నరసింహస్వామి క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






