15 July, 2026 | 12:24 AM

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

09-06-2024 02:00 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి 

ఏర్పాట్లపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగానికి ఆదేశం 

ప్రభుత్వాలు ఏవైనా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా నిలిచారు 

రామోజీఫిలిం సిటీ హైదరాబాద్ నగర ఖ్యాతిని పెంచింది 

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాం తి): అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు రంగారెడ్డి కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో  భట్టి  సమీక్షించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆదివారం ఉదయం 9  10 గంటల మధ్య అంత్యక్రియలకు జరగనుండగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, రామోజీ ఫిలిం సిటీలో సందర్శకుల కోసం భద్రపరిచిన రామోజీరావు భౌతికఖాయాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి, నివాళులర్పించారు. ఆయన సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. కొందరు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబసభ్యులకు తమ సంతాపం వెలిబుచ్చారు.