27 March, 2026 | 9:56 PM

Breaking News

ఘనంగా పెద్దమల్లరెడ్డిలో శ్రీ సీతారాముల కళ్యాణం   •   కంచర్లలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు   •   బీసీ కమ్యూనిటీ హాల్కు భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం   •   శ్రీరామ నవమి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ కోట నీలిమ   •   సంగమేశ్వర్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం   •   ఘనంగా శివంపేటలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక   •   గోదావరి నదిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన డిడిఆర్ఎఫ్ బృందం   •   శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్తంభించిన ట్రాఫిక్   •   అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములోరి కళ్యాణోత్సవం   •   సీఈఆర్ క్లబ్‌లో తాగునీరు సౌకర్యాలు కల్పించాలి   •  

ప్రేక్షకుల మనసుల్ని ‘తస్కరించుట’కు..

22-10-2024 12:00 AM

సన్నీ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘తస్కరించుట’. ఈ చిత్రాన్ని క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథతో దర్శకుడు శివప్రసాద్ చలువాది తెరకెక్కిస్తున్నారు. రెచెల్ పిక్చర్స్ బ్యానర్‌పై షేక్ అఫ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. పూజా కార్యక్రమానికి యంగ్ హీరో ఆకాశ్ పూరి, నిర్మాత బెల్లంకొండ సురేశ్ అతిథులుగా పాల్గొన్నారు.

ఆకాశ్ పూరి స్క్రిప్ట్ అందించి, కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం మూవీ పోస్టర్ ఆవిష్కరించారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా  నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ.. “తస్కరించుట’ సినిమాతో ఈ మూవీ టీమ్ ప్రేక్షకుల మనసుల్ని తస్కరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. హీరో సన్నీ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంతో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం.

క్రైమ్ కామెడీ జానర్‌లో మూవీ ఉంటుంది’ అని తెలిపారు. నిర్మాత షేక్ అఫ్రీన్ మాట్లాడుతూ ‘ఈ క్రైమ్ కామెడీ సినిమా మా సంస్థకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ‘వచ్చే నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. పేరున్న ఆర్టిస్టులు మా మూవీలో నటించనున్నారు.

వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని దర్శకుడు శివప్రసాద్ చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: కే రాకేశ్; ఎడిటర్: వెంకట్; సినిమాటోగ్రఫీ: అజయ్ ఎర్రగుంట్ల; మ్యూజిక్: రోహిత్; స్టోరీ-స్క్రీన్ ప్లే: పండు చరణ్; ప్రొడ్యూసర్: షేక్ అఫ్రీన్; డైరెక్టర్: శివప్రసాద్ చలువాది.