31 March, 2026 | 2:46 PM

Breaking News

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •  

ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోవాలంటే..రాహుల్ ఎన్నో జన్మలెత్తాలి

10-09-2024 03:59 AM
  1. ఆయన విదేశాలకు వెళ్లేదే భారత్‌ను అవమానించేందుకు.. 
  2. కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనలో చేసిన ఆరోపణలపై కాషాయ పార్టీ ఘాటుగా స్పందించింది. విదేశాలకు వెళ్లి భారత్‌ను అవమానించే అలవాటు రాహుల్‌కు ఎప్పటినుంచో ఉందని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ మండిపడ్డారు. దేశం పరువు తీసేందుకే విదేశీ పర్యటనలకు రాహుల్ వెళతారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అర్థం చేసుకోవాలంటే రాహుల్ ఎన్నో జన్మలు ఎత్తాలని, దేశ ద్రోహులకు ఇదెప్పటికీ అర్థం కాదని దుయ్యబట్టారు. ఆర్‌ఎస్ ఎస్ దేశ విలువలు, సంస్కృతి నుంచి పుట్టిందని గిరిరాజ్ పేర్కొన్నారు. 

చైనాతో ఒప్పందం ప్రకారమే..

చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం ప్రకారమే రాహుల్‌గాంధీ మాట్లాడుతారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. చైనా తరఫున రాహుల్ బ్యాటింగ్ చేస్తారని మండిపడ్డారు. అంతేకాకుండా భారత న్యాయవ్యవస్థపైనా నిత్యం దాడి చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.