calender_icon.png 9 July, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

09-07-2025 12:07:56 AM

తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ

ముషీరాబాద్, జూలై 8 (విజయక్రాంతి) : కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తా నుండి ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో సిఐటియు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, వికలాంగుల హక్కుల వేదిక, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు అన్నిటిని పెట్టుబడిదారీ అనుకూల చట్టాలుగా మారుస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరు ణ జ్యోతి, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి, రజక వృత్తిదారుల సంఘం నగర కార్యదర్శి గోపాల్, సిఐటియు గ్రేటర్ హైదరా బాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు జె.కుమారస్వామి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పట్టణ పౌర హక్కుల  నాయకులు ఎం.శ్రీనివాస్, కెవిపిఎస్ నగర కార్యద ర్శి సుబ్బారావు, డివైఎఫ్‌ఐ నగర నాయకులు రాజయ్య, ఐద్వా నగర కార్యదర్శి వరలక్ష్మి, అధ్యక్షులు పద్మ, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నాయకులు పాల్గొన్నారు.