09-07-2025 12:08:21 AM
మునిపల్లి, జులై 8 : మండల పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన నాసపు చంద్రయ్య అనే వికలాంగునికి పీఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం టీవీఎస్ ఎక్సెల్ ఫోర్ వీలర్ ను ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్‌ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తాటిపల్లి మల్లేశం, కోఆర్డినేటర్ పెద్దలోడి రాజు, మాజీ ఉప సర్పంచ్ తుడుం దుర్గయ్య బిఆర్‌ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మౌలానా , నాయకులు బాగయ్య, యాదయ్య గౌడ్, గాండ్ల నరేష్, బక్కన్న, దత్తు, నాగరాజు, అంజయ్య గౌడ్, చీలపల్లి ఎక్బాల్, సురేష్, నర్సింలు, నవీన్ గౌడ్, ఆంజనేయులు, నవీన్ పాల్గొన్నారు.