09-07-2025 12:07:10 AM
మేడ్చల్, జూలై 8(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత పీడిస్తోంది. పల్లె దవఖానాలు, బస్తీ దవఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆసుపత్రిలోనూ సరైన మందులు లేవు. ఆయా ఆ సుపత్రులలో వైద్యులు పరీక్షించి మందులు రాసిన తర్వాత ఫార్మసిస్ట్ దగ్గరికి వెళితే కొన్ని మందులు దొరుకుతున్నాయి.
మిగతా మం దులు తమ వద్ద లేవని, బయట కొనుగోలు చేయాలని చెబుతున్నారు. దీంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. వై ద్యులు ఐదు రకాల మందులు రాస్తే అం దులో కనీసం రెండు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు.
పల్లె దవఖానాలు, బస్తీ దవఖానాలలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. వీటి లో తగినంత సిబ్బంది లేకపోవడమే గాక, మందులు కూడా ఉండడం లేదు. కొన్నిచోట్ల నర్సులే వైద్యం చేస్తున్నారు. మందులు సరిగా రావడం లేదని, తమ ఆసుపత్రి పేరు రాయవద్దని ఒక బస్తీ దవఖాన సిబ్బంది తెలిపారు.
వ్యాధుల సీజన్ లో..
అసలే వర్షాకాలం వ్యాధుల సీజన్. వర్షాలు కురుస్తుంటే వ్యాధులు ముసురుకుంటాయి. వర్షా కాలానికి ముందే అన్ని ర కాల మందులు సిద్ధం చేసుకోవాలి. ఈ సమయంలో మందుల కొరత ఉండటం వల్ల రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోగాలు ముసురుకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జ్వరానికి వాడే పారాసెటమల్, యాంటీబయాటిక్, జలుబు నివారణకు ఉపయోగించే సీటరిజైన్ వంటి మందులు కూడా కొన్నిచోట్ల అందుబాటులో లేవు.
ఆస్పత్రుల నుంచి ఇండెంట్లు రానందున మందులు సరఫరా కావడం లేదో, అసలు మందులే లేవు తెలియని పరిస్థితి ఏర్పడింది. వైద్యాధికారుల పర్యవేక్షణ సరిగా లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏ ఆస్పత్రి పనితీరు ఎలా ఉంది, మందులు ఉన్నాయో, లేవో పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవలసిన అవసర ముంది.
షుగర్, బిపి మందులూ లేవు!
మధుమేహం, బిపి రోగులు ప్రతినెల క్ర మం తప్పకుండా పల్లె, బస్తీ దవఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మందు లు తీసుకుంటారు. వీరికి కూడా సరిగా మందులు అందడం లేదు. నెల రోజులకు స రిపడా మందులు ఇవ్వాల్సింది పోయి పది రోజులకు ఇచ్చి మళ్లీ రమ్మని చెబుతున్నారు. అంతేగాక డాక్టర్ కు చూయించుకోవాలని, రక్త పరీక్ష చేయించుకోవాలని రోగులను ఇబ్బంది పెడుతున్నారు. శ్వాసకోస వ్యాధు లు, చర్మ వ్యాధులకు సంబంధించిన కూడా మందులు అందుబాటులో లేవు.
స్పందించని డీఎంహెచ్ వో
మందుల కొరత విషయమై వాట్సాప్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఉమా గౌరీ వివరణ కోరగా స్పందించలేరు.