30 July, 2026 | 1:08 AM

దంచి కొడుతున్న వర్షం..

30-07-2026 12:00 AM
  1. ఆనందంలో అన్నదాతలు
  2. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 18.9 సెం.మీ వర్షపాతం
  3. నిలిచిపోయిన జగిత్యాల ధర్మపురి రాకపోకలు 

కరీంనగర్ , జులై 29 (విజయ క్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్నదాతలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలల నుండి వర్షాల కోసం చూస్తున్న రైతులకు ఈ వర్షాలు కొంత ఊరట కల్పించాయి. బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మంగళ, బుధవారల్లో భారీ వర్షపాతం న మోదయింది. మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతా లు జలమయం కాగా, రోడ్లన్నీ చిత్తడిగా మా రాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచిస్తున్నారు. 

జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 18.9 సెం.మీ వర్షపాతం

జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 18.9 సెం.మీ వర్షపాతం నమోదైంది, మిగతా జి ల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడ్డా యి. కుండపోత వర్షాలకు ధర్మపురి మండలంలో అనంతారం, నేరెళ్ల వాగులు ఉప్పొం గాయి. అక్షయపల్లె వద్ద వంతెన నీటమునిగింది. దీంతో జగిత్యాల-ధర్మపురి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి.

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో/ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే 798919 3131 నంబర్ కు సమాచారం అందించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కోరారు. అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధి త శాఖల అధికారులు వెంటనే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపడతారని తెలిపారు.

భారీ వర్షాలపై జిల్లా పోలీసుల అప్రమత్తత

కోరుట్ల/జగిత్యాల, జూలై 29 (విజయ క్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నే పథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధా న్యం ఇస్తూ జిల్లా పోలీసు శాఖ అప్రమత్తం గా వ్యవహరిస్తోంది. బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అలాగే వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, నీరు నిలిచే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్పీ పోలీ సు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడైనా ట్రాఫిక్కు అంత రాయం ఏర్పడితే వెంటనే స్పందించి రాకపోకలను పునరుద్ధరించాలని, ప్రమాదకర ప్రాంతాల్లో తాత్కాలిక హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమ త్తం చేయాలని ఆదేశించారు. వర్షాల సమయంలో చేపల వేట, ఈత, వరద నీటిలోకి వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరం గా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, గతంలో వరదలతో ప్రభావితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయట కు రావద్దని, వాగులు, వంకలు, వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనీయవద్దని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్-100కు సమాచారం అందించాలని సూచించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన మేయర్, డిప్యూటీ మేయర్

ముకరంపుర, జూలై 29(విజయ క్రాంతి)కరీంనగర్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భగత్ నగర్ లోని ఉన్న గుట్టమీది అంజనాద్రి క్షేత్రం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడ కూలిపోయింది. సుమారు 25 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ప్రహరీ గోడ, ఎడతెరిపి లేని వర్షాలకు పూర్తిగా తడిసి బలహీనపడటంతో పక్కనే ఉన్న వీధిలో కూలిపోయింది. ప్రహరీ గోడ శిథిలాలు ప్రక్కనే ఉన్న ఇండ్లపై, రోడ్డుపై పడటంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

స్థానిక కార్పొరేటర్ పొన్నం లక్ష్మి-మొండయ్య సమాచారం ఇవ్వడంతో వెంటనే కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వ యంగా పరిశీలించారు.వీధిలో మరియు పక్కనున్న ఇండ్లపై పడిన శిథిలాలను తక్షణమే తొలగించి, ప్రజలు నడిచేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దారిని వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

శిథిలాల తొలగింపు కోసం తక్షణమే జేసీబీ, ట్రాక్టర్ వాహనాలతో పాటు, డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించి సహాయక చర్య లను వేగవంతం చేశారు. దారిని క్లియర్ చేసి న అనంతరం, కూలిపోయిన ప్రదేశంలో తిరి గి నూతన కంపాండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. ఆలయం చుట్టూ ఉన్న మిగిలిన ప్రహరీ గోడ కూడా బలహీనంగా ఉన్న ట్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన వారు, మిగతా గోడ సామర్థ్యాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు కృషి లేదా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

వర్షాకాలంలో విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండండి

కరీంనగర్ క్రైం, జూలై 29 (విజయ క్రాంతి): వర్షాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, విద్యుత్ శాఖ కరీంనగర్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ రవీందర్ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ మన జీవితానికి వెలుగు నిచ్చే అమూల్యమైన శక్తి అయినప్పటికీ, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. గృహ విని యోగదారులు, రైతులు, పశువులకాపలాదారులు, విద్యార్థులు, ప్రజలందరూ విద్యుత్ భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఏదైనా విద్యుత్ ప్రమాదం లేదా లోపం గమనించిన వెంటనే టి జి ఎన్ పి డి సి ఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

విద్యుత్ ఎస్‌ఈ రవీందర్