వేగంగా ట్రిపుల్‌ఆర్ ఉత్తర కారిడార్ పనులు
ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ (ట్రిపుల్‌ఆర్) ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో డాక్టర్ కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన 161.518 కి.మీ. పొడవైన 6 లేన్ల రహదారి కోసం డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైందన్నారు. ఈ ప్రాజెక్టు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హామ్)లో రూ.23,935.6 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయడానికి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలించిందని తెలిపారు. దక్షిణ ప్రాంతీయ రింగ్ రోడ్‌కు సంబంధించిన డీపీఆర్ ఇంకా తుది దశకు చేరుకోలేదన్నారు.






