11-01-2026 01:00:28 AM
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ- ఫెలోస్ ఇండియా 2026
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): హృదయ వైద్య రంగంలో తెలంగాణను జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్‌లో ఫెలోస్ ఇండియా 2026 అధునాతన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. జనవరి 9 నుంచి 11 వరకు నోవోటెల్ హైదరాబాదు కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ మూడు రోజుల అకడమిక్ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖ హృదయ వైద్య నిపుణులు హాజరయ్యారు.
శాస్త్రీయ సదస్సుల్లో క్లిష్టమైన కోరొనరీ యాంజియోప్లాస్టీలు, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ చికిత్సలు, ఆధునిక వాల్వులర్ ప్రొసీజర్లు, కొత్త వైద్య పరికరాలు, భవిష్యత్తు కార్డియాలజీపై ప్రత్యేక సెషన్లు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో డా. ఎన్. ప్రతాప్ కుమార్, ఆర్గనైజింగ్ ఛైర్మన్, డా.శరత్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫెలోస్ ఇండియా 2026, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, డా. అనిల్ కృష్ణ జి, చైర్మన్, ఎండీ పాల్గొన్నారు.