26 August, 2026 | 9:08 PM

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష

26-08-2026 08:21 PM

ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాల్లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

కమాన్‌పూర్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ శ్రీ ఆదివరాహ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సేవల్లో విశేషంగా పాల్గొన్న వారికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్ ఆధ్వర్యంలో శ్రీను బాబు చేతుల మీదుగా మెమెంటోలు అందజేశారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, ఆలయ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.