పేదల వరంగా నిలుస్తున్న ఇందిరమ్మ ఇళ్లు
14-03-2026 05:49 PM
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి
బిక్కనూర్,(విజయక్రాంతి): పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం బిక్కనూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రేఖ సుదర్శన, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, భూమయ్య, మద్దూరి రవి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




