కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది
సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు
మంథని, రామగిరి,(విజయక్రాంతి): కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని, పార్టీ సంస్థాగత నిర్మాణంలో పార్టీ కార్యకర్తలు చిత్తశుద్ధితో పని చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Srinu Babu) అన్నారు. మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి పీసీసీ దాకా పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తుందన్నారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు దక్కే అవకాశం ఉందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress Government) చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకవెళ్ళాలని శ్రీనుబాబు((Duddilla Srinu Babu) అన్నారు.
ఈ సమావేశంలో మంథని మున్సిపాలిటీ కి, ముత్తారం మండలాలకు చెందిన మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు నామినేటెడ్ పదవుల ఆశ వాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వక్స్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, టీపీసీసీ పరిశీల కులు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పురి సదానందం, మంథని, ముత్తారం, రామగిరి మండలాల అధ్యక్షులు ఐలి ప్రసాద్, బాలాజీ, రొడ్డ బాపు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగిరి మండలంలోని సత్య ఫంక్షన్ హాల్ లో గురువారం సాయంత్రం మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ అధ్వర్యంలో ని ర్వహించిన పాలకుర్తి, కమాన్ పూర్, రామగిరి మండలాల సంస్థాగత ఎన్ని కల సన్నాహక సమావేశంలో టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పా ల్గొన్నారు. ఆయా మండలాలకు చెందిన మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షు లు, నామినేటెడ్ పదవుల ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.






