24 February, 2026 | 7:16 PM

కన్నాలలో ఘనంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు

24-02-2026 05:23 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని కన్నాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ  అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా శ్రీనుబాబు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.  మంథని నియోజకవర్గంలోని పేద ప్రజల అభ్యున్నతి కోసం శ్రీను బాబు అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు తోకల మల్లేష్, కావటి సందీప్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, నాంపల్లి వెంకట్, రంజిత్, కృష్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.