17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పసిపాప మరణానికి కారణమైన వారిపై హత్య నేరం కేసు పెట్టాలి

24-02-2026 05:27 PM

ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

ఖానాపూర్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దళిత, రజక కుటుంబాలను అడ్డుకోవడంతోపాటు పసిపాపను తొక్కి చంపిన పెత్తందారులను హత్యా నేరం కింద వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి కొమ్ము కాసిన సీఐ, ఎస్ఐ పోలీసులను తక్షణమే విధుల నుండి తొలగించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్  బాణోత్ గోవింద నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

జాతరలో దర్శనం టికెట్ కు రసీదు ఇవ్వాలని అడిగినందుకు పెత్తందారులు దాడి చేసి కొట్టడమే కాకుండా, పసిపాపను కాలితో తొక్కి చంపిన ఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని అన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులను పక్కనపెట్టి పెత్తందారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధితులపై కేసు నమోదు చేయడం అప్రజా సామ్యమని అన్నారు. కేసు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.