calender_icon.png 7 February, 2026 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు చేతి గుర్తుకు ఓటు వేయాలి

07-02-2026 01:55:24 PM

విద్యావేత్త అయిన వకీల్ సాబ్ ను అధిక మెజార్టీతో గెలిపించాలి

మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కు ఓటు వేయాలని, విద్యావేత్త అయిన సీనియర్ వకీల్ సాబ్ ముసుకుల సురేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో  శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీపిసిసిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ప్రజలను కోరారు. శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బలపరిచిన 5వ వార్డు అభ్యర్థి ముస్కుల సయేందర్ రెడ్డికి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ కూచిరాజ్‌పల్లి ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరుగుతుందని,  

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని, మంథని పట్టణ అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్ అధిత,  మంథని మున్సిపల్ మాజీ చైర్మన్ పెండ్రు రమాదేవి, కిసాన్ సేల్ జిల్లా చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, నాయకులు తోకల మల్లేష్, మోహన్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు.