07-02-2026 01:39:28 PM
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం(Municipal election campaign) జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయంపై హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మెదక్ జిల్లాకు నీరు అందుతోందని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు పాతాళానికి పడిపోయాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన ఎన్నో మంచి పథకాలకు బంద్ పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఏర్పడిందని ద్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మెదక్ జిల్లాకు నీరు అందుతోందని వెల్లడించారు.