1 July, 2026 | 10:19 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సుదీర్ఘ పోరాట చరిత్ర టీపీటీఎఫ్ సొంతం

30-05-2025 12:15 AM

రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుటారి రాజు

భద్రాచలం,మే 29 (విజయ క్రాంతి) భారతదేశ స్వాతంత్ర ఉద్యమాల స్ఫూర్తితో, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో 1932లో ఫెడరేషన్ ఆవిర్భవించిందని, బ్రిటిష్ ప్రభుత్వ అణిచివేత, ఉపాధ్యాయ సంఘ నాయకులపై చర్యలు తదితర కారణాల వలన పడి లేస్తూ స్వాతంత్రా నంతరం 1947లో ఆంధ్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఈటిఎఫ్) గా  పునర్వ్యవస్థీకరించబడిందని,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీటీఎఫ్ గా తెలంగాణ రాష్ట్రంలో టీపీటీఎఫ్ గా వైయుక్తిక, ఉమ్మడి ఉద్యమాలను నిర్మించి నిర్వహించిన ప్రప్రధమ ఉపాధ్యాయ సంఘం అని, సుదీర్ఘ పోరాటాల చరిత్ర టిపిటిఎఫ్ సొంతమని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు అన్నారు. టిపిటిఎఫ్ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాచలం కార్యాలయం ఎదుట టిపిటిఎఫ్ పతాకం ఆవిష్కరణ చేసిన అనంతరం జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ....

సమాజ శ్రేయస్సు, విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షే మం లక్ష్యాలుగా, బాధ్యతలకు నిలబడు, హక్కులకై కలబడు నినాదాలుగా టిపిటిఎఫ్ పనిచేస్తున్నదన్నారు. విద్యారంగంలో ప్రైవేట్, కార్పొరేటీకరణలను, ప్రభుత్వ పాఠశాలల మూసివేతలను ఒక వైపు వ్యతిరేకిస్తూ జరిగే పోరాటాలలో పాల్గొంటూనే, మన ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవాలని, అందుకు బడిబాటలో ఉపాధ్యాయులు అందరూ పాల్గొని,

తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ విద్యారంగం పట్ల, ఉపాధ్యాయుల బోధన పట్ల నమ్మకాన్ని కలిగించి, ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల పట్ల అవగాహన కల్పించి అడ్మిషన్లు పెంచడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ కార్యదర్శి, ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గ సభ్యులు మునిగడప రామాచారి వి.ముత్తయ్య, పి.రాంబాబు, ఎం.సత్తెమ్మ, ఎస్.లక్ష్మి తదితరులు  పాల్గొన్నారు.