1 July, 2026 | 11:27 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఎన్టీరామారావు జయంతి సందర్భంగా అన్న, వస్త్ర దానం

30-05-2025 12:16 AM

పెబ్బేరు మే 29 : ప్రముఖ నటుడు, ఉ మ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయం తిని గురువారం ఘనంగా నిర్వహించారు. చిత్రకాడు శివకుమార్ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా గుడి వద్ద ఎన్టీరామారావు పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేక్రమంలో కొంతమందికి నూతన వస్త్రాలు అందించారు.

పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో అప్పుడు సంభవించిన ఆకలి చావు అనంతరం ఆయన మన స్సు చలించి, పేదలు ఎవరూ పస్తులు ఉండరాదని దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. అదేక్రమంలో రెండురూపాయలకు కిలోబియ్యం పంపిణీ చేశారు.

అదే స్ఫూర్తితో నేడు యావత్ భారతదేశంలో ఉచిత బి య్యం, గోధుమల పథకం కొనసాగుతుంద ని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తేతెదేపా రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడు, మాజీ వైస్ చైర్మన్ కర్రెస్వామి, గోల్ బాలస్వామి, తిరుమలేశ, రాజు, అఖిల్ చారి, హన్మంతు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.