1 July, 2026 | 10:36 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రహరీ నిర్మాణంలో ఆలయ ఆనవాళ్లు

17-05-2026 12:00 AM

మహబూబాబాద్/వెంకటాపూర్ (విజయక్రాంతి) : ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహరీ నిర్మాణం కోసం జేసీబీ యంత్రాలతో పునాదులు తీస్తుండగా పురాతన ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయి. క్యాంపస్ చుట్టు భారీ ప్రహరీ నిర్మాణం కోసం జేసీబీలతో లోతుగా పునాదులు తవ్వు తుండగా భారీ రాతి నిర్మాణాలు బయటపడ్డాయి.

గిరిజన యూనివర్సిటీ నిర్మాణ స్థలం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయానికి సమీపంలో ఉండటం, అదే పరిసర ప్రాంతంలో ఇప్పుడు బయటపడిన ఈ శిలలు కూడా కాకతీయుల కాలం నాటివే అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఆకృతులను గమనించిన కొందరు ఇవి చిన్న ఉప ఆలయాలు లేదా కాకతీయుల కాలానికి చెందిన మండప నిర్మాణాల అవశేషాలు కావచ్చని అభిప్రాయపడుతున్నా రు. తవ్వకాలు కొనసాగుతున్న సమయంలో పురాతన రాతి శిలలను జేసీబీ కదిలిస్తున్న సమయంలో రాళ్ల మధ్య నుంచి ఒక్కసారిగా నాగుపాములు బయటకు వచ్చాయి.

మూడు పెద్ద నాగుపాములు బయటకు రావడంతో అక్కడున్న కార్మికులు, అధికారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీన్ని స్థానికులు ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు బయటపడిన శిలలు, నిర్మాణ అవశేషాలపై నిపుణులు త్వరలో పరిశీలన చేపట్టనున్నారు. అప్పటి వరకు తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని యథాతథంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.