18 August, 2026 | 1:20 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

కౌలాస్ కోటలో చతుర్భుజి సరస్వతి

17-05-2026 12:00 AM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులోని జుక్కల్ మండలంలోని ప్రఖ్యాతిగాంచిన సంస్థానాల్లో ఒకటైన కౌలాస్ సంస్థానంలోని 12,-14వ శతాబ్దాల మధ్యకాలం నాటి ప్రాచీన కోటను శనివారం భీమ్‌గల్ మండలానికి చెందిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ సందర్శించారు. అనేక చారిత్రాత్మక కోటలు, ఫిరంగులు, కోటలోపల గల రాణి మహల్, ఏనుగులబావి, శిథిలమైన శివాలయం, ఆయుధశాలను పరిశీలించారు. శివాలయం పక్కనే పడి ఉన్న ఒక విగ్రహాన్ని కంకణాల రాజేశ్వర్ కనుగొన్నారు. వివరాలు తెలియ రాకపోవడంతో రాతి విగ్రహాన్ని ఫోటో తీసి కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్‌కు పంపడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చరవాణిలో మాట్లాడిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఈ విగ్రహం కాకతీయ శైలికి చెందిన సరస్వతి విగ్రహంగా పేర్కొన్నారు.

కీర్తి ముఖతోరణంతో శిల్పం

శ్రీరామోజు హరగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం కీర్తి ముఖతోరణంతో ఉన్న చతుర్భుజి సరస్వతి శిల్పంగా పేర్కొంటూ, సరస్వతి పరహస్తాలలో అంకుశం, పాశాలను నిజ హస్తాలలో (అక్షరమాల, అభయహస్తం ఉండాల్సిన) కుడి చేయి విరిగింది. ఎడమ చేతిలో పుస్తకం ధరిం చి, అర్థ పద్మాసనంలో కనిపించిన సరస్వ తి శిల్పం అందమైన హంస వాహనంగా చెక్కబడి ఉందని అన్నారు. ఇలాంటి ప్రాచీన చారిత్రాత్మక శిల్ప సంపదను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కంకణాల రాజేశ్వర్ అన్నారు.

శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం 99494 98698