1 July, 2026 | 9:33 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఈ వారం వార్తల్లో..

17-05-2026 12:00 AM

తైవాన్ బరాబర్ మాదే!

తైవాన్ విషయంలో చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ కఠినమైన వైఖరి అవలంబిస్తున్నారు. ఆ దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. తైవాన్ వందకు వందశాతం చైనాలోని భూభాగమేనని వాదిస్తున్నారు. అవసరమైతే సైనిక బలాన్ని ఉపయో గించి మరీ, ఆ ప్రాంతాన్ని చైనాలో విలీనం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో అమెరికా జోక్యంపైనా మండిపడుతున్నారు. 

సతీశన్ ఎదుట సవాళ్లు

ఎడతెగని ఉత్కంఠ నడుమ ఏఐసీసీ ఇటీవల కేరళం సీఎం పదవిని వీడీ సతీశన్‌కు కట్టబెట్టింది. కాంగ్రెస్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న సతీశన్‌కు పార్టీ మద్దతైతే ఉంది గానీ, ఇకపై ప్రజల మద్దతు ఎలా ఉంటుందనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే.. రాష్ట్ర ఖజానా పూర్తిగా నిల్లు. పైగా తలపై నెలనెలా అప్పుల చెల్లింపులు, వడ్డీల భారం. వాటిని చక్కదిద్దుకుంటూనే సంక్షేమ పథకాలనూ అమలు చేయాల్సిన పరిస్థితి.