7 May, 2026 | 2:03 AM

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

07-05-2026 01:30 AM

గట్టు, మే 6: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలి స్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గట్టు ప్రాంతానికి ఇసుకను తరలిస్తుండగా పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు.

రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని డ్రైవ ర్లు బోయ చిన్న తిరుమలేశును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుం డా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.