అయిజలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
07-05-2026 01:29 AM
అయిజ మే 6: అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని తిక్క వీరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ సురేష్,మునిసిపల్ కమిషనర్ చంద్రశేఖర రావు కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ సురేష్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర లభించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తిరుమలేష్ రజాక్,శివ, కృష్ణ మరియు టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు టి ఆర్ ఎస్ కార్యకర్తలు మహిళా సంఘాలు పాల్గొన్నారు.






