8 June, 2026 | 11:04 PM

సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి

08-06-2026 09:38 PM

* రైస్ మిల్లు అనుమతులను రద్దు చేయాలంటూ కలెక్టర్ కి ఫిర్యాదు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి లో కల్మలచెరువు రోడ్డులో ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న రైస్ మిల్లు అనుమతులను రద్దు చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గరిడేపల్లి లోని నిర్వహిస్తున్న రైస్ మిల్ తో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండల ఎమ్మార్పీఎస్, జై భీమ్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జనావాస మధ్యలో ఉన్న రైస్ ఇండస్ట్రీ తో ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆరంజి జోన్లో ఉండాల్సిన రైస్ మిల్ జనావాసాల మధ్యలో ఉండకూడదని తెలిపారు.

నియమ నిబంధనలు పాటించకుండా మిల్లు నిర్మాణం జరగడంతో రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 కు విగాథం కలుగుతుందన్నారు. ఈ మిల్లు నిర్మాణంతో అనేకసార్లు ట్రాఫిక్ నిలిచిపోయి రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయని, మిల్లు ఏర్పాటు చేయడం ద్వారా చదువుకునే విద్యార్థులకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జనావాసాల, దేవాలయానికి, పాఠశాలకు సమీపంలో ఉన్న ఈ మిల్లు అనుమతులను వెంటనే రద్దుచేసి, గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సమస్యపై విచారణ చేయించి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.