బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలములోని బంజారా తండా గ్రామపంచాయతీ కార్యదర్శిగా మమత గత ఏడు సంవత్సరాలు విధులు నిర్వహించి బదిలీపై ఎల్లారెడ్డి మండలానికి తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సురేష్, మాజీ సర్పంచ్ అరుణ లిబియా నాయక్, గ్రామస్తులతో కలిసి ఆమెకు శాలువతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... బంజర తండ గ్రామ కార్యదర్శిగా మమత సేవలు మరువలేనివని గ్రామంలో ఒక వ్యక్తిగా స్నేహ పూర్వితంగా మమేకమై, ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించి శ్రీకారం చుట్టారన్నారు.
గ్రామానికి అన్ని విధాల సహకరించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు.అలాంటి వ్యక్తి గ్రామం నుండి బదిలీ కావడం చాలా బాధను కలిగిస్తుందన్నారు.కార్యదర్శి మమత ఎక్కడ విధులు నిర్వహించిన బంజర తండా గ్రామంలో ఏ విధంగా పనిచేశారో అలాగే పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కొనియాడారు.మాజీ సర్పంచ్ అరుణ లింబో నాయక్ జ్ఞాపికను అందజేశారు.అలాగే గ్రామానికి నూతనంగా వచ్చినటువంటి కార్యదర్శి సుజాతను కూడా సన్మానించారు.ఈ గ్రామ సర్పంచ్ సురేష్ మాజీ సర్పంచ్ అరుణ లిబియా నాయక్,వార్డ్ మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.






