calender_icon.png 19 January, 2026 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌హెచ్ 65పై వాహనాల రద్దీ

19-01-2026 12:55:06 AM

హైదరాబాద్ మార్గంలో రద్దీ

చిట్యాల, జనవరి 18 (విజయక్రాంతి): హైదరాబాద్, జాతీయ రహదారి 65పై చిట్యాల, పెద్దకాపర్తి గ్రామాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో చిట్యాల వద్ద ట్రాఫిక్ పెరగడంతో ఆదివారం వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి సెలవులు ముగియడం తో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. దీంతో ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొన్ని వాహనాలను వలిగొండ, భువనగిరి మీదుగా హైదరాబాద్‌కు మళ్లించారు. దీంతో చిట్యాల వద్ద ట్రాఫిక్ నియంత్రణలోకి వచ్చింది.

ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాం తంలో ట్రాఫిక్ ఎక్కువ అయినప్పుడు ఆ ట్రాఫిక్‌ను రామన్నపేట, వలిగొండ భువనగిరి మార్గాల మీదుగా దారి మలిస్తున్నారు. దారి మళ్ళించడంతోపాటు పాటు పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రతి ఒక్క వాహనదారునికి సూచనలు అందిస్తూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే విధంగా చర్యలు చేపడుతున్నారు.