19-01-2026 12:56:09 AM
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): రాజాధికారం పార్టీ ఆదేశాల మేరకు చైతన్య బాట కార్యక్రమాన్ని ఆదివారం చేగుంట మండల పరిధిలోని వడియారం, చిట్టోజిపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేగుంట మండల అధ్యక్షులు కంచర్ల సిద్ధగౌడ్ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు భారీ ఎత్తున తెలంగాణ రాజాధికార పార్టీలో చేరారు. వీరిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఇమంపురం యాదగిరి గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లెలోని ప్రతి గడపకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెళ్తుందని, రాజ్యాధికార పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రాబోయే కాలంలో కచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇమంపురం యాదగిరి గౌడ్, మెదక్ జిల్లా యూత్ అధ్యక్షులు రవీందర్ పాల్గొన్నారు.