4 August, 2026 | 7:17 PM

జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రానికి స్తంభించిన రాకపోకలు

04-08-2026 05:56 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మంగళవారం తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రం నుండి ఆళ్ళపల్లి మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించిపోయాయి అనిశెట్టిపల్లి సమీపంలోని పుణ్యపువాగు, పొంగి పొర్లుతున్న నేపథ్యంలో పూర్తి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని కిన్నెరసాని జల్లేరు తదితర వాగులు పొంగి ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దని ఎట్టి పరిస్థితుల్లోను వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు