4 August, 2026 | 6:57 PM

జవాబు చెప్తే.. పెన్ను, పుస్తకం బహుమతి

04-08-2026 06:15 PM

కలెక్టర్ వినూత్న ఆలోచన

నిర్మల్,(విజయక్రాంతి): పాఠశాల చదివి విద్యార్థులకు ఉపాధ్యాయుడు బహుమతి ఇస్తేనే మురిసిపోతారు. అలాంటిది జిల్లా పాలన అధికారి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న వినూత్న ఆలోచన విద్యార్థులను సంబరం చేస్తుంది. ఈ పాఠశాలకు వెళ్లిన తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ టీచర్గా మారి పాఠాలు బోధిస్తున్నారు. బోర్డుపై ప్రశ్నలు రాసి జవాబులు చెప్తే విద్యార్థులను పేజీ పెన్నులు పుస్తకాలు బహుమతులుగా అందించి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. మంగళవారం  జిల్లా కలెక్టర్ సో న్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి పాఠాలు బోధించి జవాబులు చెప్పిన విద్యార్థులకు బహుమతులను పెన్నులు పుస్తకా రూపంలో అందించడంతో వారు సంతోషపడ్డారు