4 August, 2026 | 7:10 PM

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం

04-08-2026 05:58 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పాత అంగడి బజార్ లో నూతనంగా నిర్మిస్తున్న డ్వాక్రా సంఘం భవన పనులను అలాగే కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ పనుల నాణ్యత, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.