9 June, 2026 | 1:52 AM

క్షేత్రస్థాయి పర్యటనలో ట్రైనీ ఐఏఎస్‌లు

09-06-2026 01:02 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 8 (విజయక్రాంతి): డాక్టర్ ఎం.సి.ఆర్ హెచ్.ఆర్.డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2025 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల శిక్షణలో భాగం గా ‘తెలంగాణ దర్శన్’ కార్యక్రమంలో భా గంగా ఆరుగురు ట్రైనీ ఐఏఎస్ అధికారులు సాయి శివాని, సచిన్ బసవరాజ్, శ్రీకాంత్ రెడ్డి, హరి ప్రసాద్, పారస్ కుమార్, సురేష్ 7,8 తేదీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా ట్రైనీ అధికారులు పాండవులగుట్ట (రేగొండ మం డలం), కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (చెల్పూర్), అలాగే సింగరేణి ఓపెన్కాస్ట్ అండర్ గ్రౌండ్ మైనింగ్ లను  సందర్శించారు. రెం డు రోజుల  పర్యటన ముగిసిన అనంతరం, సోమవారం  శిక్షణా ఐఏఎస్ అధికారులు ఐ డిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రా హుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహించిన పర్యటనకు సంబంధించిన వివిధ అంశాలను అధికారుల బృందాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ అడిగి తెలుసుకున్నారు.

క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులు తమ పరిశీలనలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ విధులు నిర్వహించే ప్రతి అధికారికి క్షేత్ర స్థాయి అవగాహన అ త్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే గ్రామీ ణ, స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవడం అవసరమని ఆయన సూచించా రు. ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు అన్ని శాఖల సమ న్వయంతో పని చేయాలని కలెక్టర్  తెలిపారు.