భువనగిరి ఖిల్లాను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు
యాదాద్రి భువనగిరి, జూన్ 18 (విజయక్రాంతి): చారిత్రక భువనగిరి ఏకశిలా దుర్గం, ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణ క్యాడర్ ట్రైనీ ఐఏఎస్‌ల బృందం మంగళవారం సందర్శించింది. ఏడుగురు అధికారుల బృందం తెలంగాణ దర్శినిలో భాగంగా భువనగిరి ఖిల్లాను సందర్శించి చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు. అలాగే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కొలనుపాకలోని జైన తీర్థంకరుడు మహావీరుడు, సోమేశ్వర ఆలయాలను సందర్శించి క్షేత్ర మహత్యాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ అధికారులు కుమారి ఎన్ ఉ మాహార తి, కుమారి గరిమా నరుల, అభిజ్ఞా న్ మాలవీయ, అజయ్ యాదవ్, మృణాల్ శ్రేష్ట, ఐఈఎస్‌ఎస్‌డీ మనోజ్‌తో పాటు నోడల్ అధికారి శ్రీనివా స్, డీఆర్‌డీవో అసిస్టెంట్ సురేశ్, ఆలేరు తహసీల్దార్ శ్రీనివాస్, టూరిజం గైడ్ వినోద్ పాల్గొన్నారు.






