పాతబస్తీలో వివాహితపై దాడి
చార్మినార్, జూన్ 18: వివాహితపై ఓ యువకుడు స్క్రూ డ్రైవర్‌తో దాడి చేసిన ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ఆమె గాయాలతో బయటపడింది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకా రం.. ఛత్రినాక ఎస్సార్టీ కాలనీకి చెంది న శ్రావ్య(24) బ్యూటీషీయన్‌గా పని చేస్తోంది. 2019లో శ్రావ్య ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకోగా మనస్పర్థలు రావడంతో విడిపోయి ఉంటున్నారు. ఇటీవల శ్రావ్యకు హరిబౌలికి చెందిన మణికంఠ (30)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వివా హం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే, శ్రావ్య ఇతరులతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటం తో మణికంఠకు అనుమానం వచ్చి దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రావ్య ఇంట్లో ఎవరూ లేని సమయం లో ప్రవేశించి ఆమెపై స్క్రూ డ్రైవర్‌లో దాడి చేశాడు. అనంతరం కత్తిపీఠతో ఎడమ చేయి కొసుకున్నాడు. ఇంట్లో నుంచి కేకలు రావడంతో యజమాని దీపక్ వెళ్లి కిటికి అద్దాలు పగలగొట్టి రక్తపు మడుగులో పడి ఉన్న శ్రావ్యను స్థానిక వైద్యశాలకు తరలించాడు. పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకొని స్టేషన్‌లోనే ప్రాథమిక చికిత్స అందజేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.






