మెదక్ అల్లర్ల కారకులకు రిమాండ్
సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టాం
మెదక్ ఎస్పీ డా.బాలస్వామి
మెదక్, జూన్ 18 (విజయక్రాంతి): మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలు అదుపులోకి వచ్చాయని, గొడవలకు కారణమైన ఒక వర్గానికి చెందిన 11 మంది ని, మరో వర్గానికి చెందిన 16 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెద క్ ఎస్పీ డాక్టర్ బీ బాలస్వామి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇతర జిల్లాల నుంచి పోలీస్ బలగా లను రప్పించి గొడవలను అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా లో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడి యా ద్వారా గొడవలు సృష్టించాలనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టామని, గొడవలకు సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయని, వాటి ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు.






