ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి అరెస్ట్
- మిర్యాలగూడలో అదుపులోకి
- అత్తాపూర్ ఠాణాకు తరలింపు
- నేడు ఉప్పరపల్లి కోర్టుకు
- బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు
- గొంతు నులిమిన ఆనవాళ్లు, చెంప, కాలిపై గాయాలు
రంగారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి): తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వద్ద మంగళవారం ప్రత్యేక పోలీస్ బృందాలు అదుపులోకి తీసుకుని, రాజేంద్రనగర్ సబ్‌డివిజన్ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైద రాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతు న్న సమయంలో తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికా రిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తాపూ ర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది.
విచారణను ఉమెన్స్ సేఫ్టీ విం గ్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీచేశారు. కేసు నమో దు తర్వాత విచారణ నిమిత్తం ఉదయ్ కృష్ణారెడ్డిని సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసు లు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించా రు. పక్కా సమాచారంతో మిర్యాలగూడలో ఆయనను గుర్తించిన పోలీసులు అదుపులో కి తీసుకున్నారు.
అయితే తాను పరారీలో లేనని, అనారోగ్యంతో ఉన్న నానమ్మను పరామర్శించేందుకు స్వగ్రామానికి వెళ్లానని ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమ ని, కేసును కొట్టివేయాలని (క్వాష్ పిటిషన్) కోరుతూ ఆయన ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం రాజేంద్రన గర్ డీసీపీ పర్యవేక్షణలో ఉదయ్ కృష్ణారెడ్డి పై నమోదైన సెక్షన్ల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాగా బుధవారం ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్‌కృష్ణారె డ్డిని పోలీసులు హాజరుపరచనున్నారు.
మహిళా ఐపీఎస్ గొంతు నులిమిన ఆనవాళ్లు
భాదితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించ గా గొంతుపై, చెంపపై, కాలిపై గాయాలున్న ట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదైన రోజు (జూలై 18న) బాధితురాలికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు తేలిం ది. చెంప భాగంలో కమిలిన గాయాలను గుర్తించారు. ఎడమ కాలిపైనా గాయం ఉంది. తాజాగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.






