12-06-2025 12:00:00 AM
ఖమ్మం, జూన్ 11(విజయ క్రాంతి): ఆపద మిత్రలకు విపత్తులు ఎదుర్కోవడంపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాల మేరకు బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎన్.డి.ఆర్.ఎఫ్. సభ్యులు ఆర్. మాధిలేటి ఆధ్వర్యంలో శిక్షణ అందించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే అంశం పై అవగాహన కల్పించారు.
వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా బయటపడవచ్చు, సిపిఆర్ ఎలా చేయాలి, దాని ప్రాము ఖ్యత వంటి అంశాలను పూర్తిస్థాయిలో వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఆపద మి త్రలు, గ్రామీణ అభివృద్ధి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.