calender_icon.png 6 July, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

11-06-2025 11:59:11 PM

- డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు 

కుమ్రం భీం అసిఫాబాద్, జూన్11 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర మ్మ ఇల్లు వస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు అన్నా రు. బుధవారం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5,11,18 వార్డులలో ఇం దిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.అర్హులు ఎవరు కూడా అధైర్య పడవద్దని ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్ నాయకులు గోవింద్, రాపర్తి కార్తీక్ , సాయి, జావేద్, రఫు, గంగారాం పాల్గొన్నారు.