ప్రజా ఆరోగ్యానికి వ్యాయామం
- రాంనగర్, అచ్చయ్య నగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
- ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ముషీరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి): మారుతున్న జీవన విధానంలో ప్రజల ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాంనగర్ అచ్చయ్య నగర్ ప్రాంతాల్లో స్థానిక ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రామ్ నగర్, చిప్పెండేల్ అపార్ట్మెంట్ వాసులతో బేటి అయి స్థానిక సమస్యలు అభివృద్ధి పనుల పై చర్చించారు.
అనంతరం అపార్ట్మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను మాజీ కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, రవి చారి, ముషీరాబాద్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఓబీసీ జాతీ య కార్యవర్గ సభ్యులు పూసరాజు, బీజేపీ ముషీరాబాద్ ఇన్చార్జి ఎం. రమేష్ రామ్, సికింద్రాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ లతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడు తూ నిత్యం వ్యాయామం చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలంగా మారుతాయన్నారు.
వ్యాయామం ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందన్నారు. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుందన్నారు. ఓపెన్ జిమ్ల ద్వా రా కాలనీ వాసుల మధ్య సామాజిక సంబంధాలు బలపడటమే కాకుండా, సోషల్ మీడి యా ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శక్తిసింగ్, నవీన్, జైపాల్ రెడ్డి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.






