calender_icon.png 27 October, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాటరీ ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు ఖరారు

27-10-2025 06:36:24 PM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ..

పెద్దపల్లి (విజయక్రాంతి): లాటరీ పద్దతి ద్వారా పారదర్శకంగా పెద్దపల్లి జిల్లాలో మద్యం షాపులు కేటాయింపు చేయడం జరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ తెలిపారు. సోమవారం బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన మద్యం (ఏ4) షాపుల కేటాయింపు ప్రక్రియలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 74 ఏ4 మద్యం షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్థులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయించామని, జిల్లాలో ఉన్న 74 ఏ4 మద్యం షాపులకు 1507 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన మద్యం షాపుల కేటాయింపు చేశామన్నారు.

మద్యం షాపుల కేటాయింపు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగిందని, మద్యం షాపులను దక్కించుకున్నవారు ప్రభుత్వం నిర్దేశించిన ఎక్సైజ్ టాక్స్ వార్షిక పన్నులో 6వ వంతు వెంటనే చెల్లించి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, దరఖాస్తు దారులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.