పారదర్శకంగా గ్రూప్ ప్రిలిమినరీ పరీక్ష
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 5 (విజయక్రాంతి) : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జూన్ 9న నిర్వహించబోయే గ్రూప్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గల సరోజినీ నాయుడు వని త మహావిద్యాలయంలో గ్రూప్ 1 పరీక్ష చీఫ్ సూపరిండెంట్లు, అబ్జర్వర్స్, రీజినల్ కోఆర్డినేటర్లు, జాయింట్ కస్టడియన్స్‌తో స మావేశం నిర్వహించారు. జూన్9న ఉద యం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగం ట వరకు పరీక్ష జరుగుతుందని, పరీక్ష కేం ద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, షూస్‌పై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9.30గంటలకు బయోమెట్రిక్ తీసుకోవాలని సూచించారు. 10గంటలకు పరీక్ష కేం ద్రం గేట్లు మూసివేస్తారని, అభ్యర్థులు గమనించాలని కోరారు. సమావేశంలో గ్రూప్ 1 పరీక్షల రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఏ కృష్ణయ్య, ప్రొఫెసర్ ఎన్ చందన, జిల్లా నో డల్ అధికారి వెంకటాచారి పాల్గొన్నారు.






