17 July, 2026 | 12:53 AM

ఎన్‌సీసీ శిక్షణతో మానసిక దృఢత్వం

06-06-2024 01:30 AM

కల్నల్ రాజాదత్త

గజ్వేల్, జూన్ 5: ఎన్‌సీసీ శిక్షణ ద్వారా దేశభక్తితో పాటు శారీరక, మానసిక దృఢ త్వం పెంపొందుతాయని సంగారెడ్డి బెటాలియన్ మాజీ ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ రాజాదత్త అన్నారు. గత 5 రోజులుగా గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో కొనసాగుతున్న ఎన్‌సీసీ శిక్షణ శిబిరంలో భాగంగా బుధవారం క్యాడెట్లకు వ్యక్తిత్వ వికా స తరగతులు నిర్వహించారు. వక్తగా హాజరైన కల్నల్ రాజాదత్త మాట్లాడుతూ.. యు వత ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలన్నా రు. ఆత్మవిశ్వాసంతో ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని తెలిపారు. ఓర్పు, పట్టుదలతో కృషి చేస్తే అన్నింట విజయాన్ని సొంతం చేసుకోవచ్చని తెలిపారు. ఒత్తిడి, సమయపాలన, ఇంటర్వ్యూలను ఎదుర్కొనే విధానం, స్టేజ్ ఫియర్, ఆర్మీ అధికారి ఉత్తీర్ణత పరీక్ష ఎంపికకు కావాల్సిన మెలకువల ను ఈ సందర్భంగా వివరించారు. కాగా రో జువారీ శిక్షణలో భాగంగా ఎన్‌సీసీ క్యాడెట్ల కు రాజగోపాల్‌పేట వద్ద ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో క్యాంప్ కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్  పీ మధుసూదన్ రావు, 200 మంది క్యాడెట్లు పాల్గొన్నారు.