కార్పొరేటర్ ఇంటికి ఈటల
06-06-2024 01:35 AM
కార్పొరేటర్ నర్సింహారెడ్డి ఇంట్లో ఈటల రాజేందర్‌కు అతిథ్యం
ఎల్బీనగర్, జూన్ 5: మల్కాజిగిరి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన ఈటల రాజేందర్‌కు మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తన ఇంట్లో అతిథ్యం స్వీకరించాలని ఈటల రాజేందర్‌ను ఆహ్వానించారు. ఆయ న ఆహ్వానం మేరకు బుధవారం ఈటల మన్సూరాబాద్‌లోని కొప్పుల ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి, సంతోషాన్ని వ్యక్తం చేశా రు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. తన విజయంలో నర్సింహరెడ్డి కీలక పాత్ర పో షించారని అభినందించారు. దేశంలో ఎన్‌డీఏ కూటమి అత్యధిక స్థానాలు విజయం సాధించడంపై కొప్పుల హర్షం వ్యక్తం చేశారు.






