15 July, 2026 | 1:58 AM

పారదర్శకంగా హోంగార్డుల బదిలీలు

09-06-2024 01:45 AM
  • జిల్లా ఎస్పీ గౌస్ ఆలం

97 మంది హోంగార్డులకు స్థానచలనం

అదిలాబాద్, జూన్ 8 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో హోంగార్డుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసింది జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఆదిలాబాద్ లోని పోలీస్ హెడ్ కార్టర్స్ లో చేపట్టిన జిల్లాలోని హోంగార్డుల బదిలీ ప్రక్రియను జిల్లా ఎస్పీ శనివారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిరహించడం జరుగుతుందని, అందులో భాగంగా నిర్మల్ జిల్లా నుండి 62 మంది హోంగార్డులు, అదేవిధంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి 35 మంది హోంగార్డులు ఆదిలాబాద్ జిల్లాకు రానుండ జరిగిందన్నారు. వారి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా నుండి మొత్తం 97 మంది హోంగార్డులను లక్కీ లాటరీ విధానం దారా బదిలీ ప్రక్రియను నిరహించినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో సాధారణ విధు లు నిరర్తించే హోంగార్డులు, వాహన డ్రైవ ర్స్, దోబీలు, వంట పని చేసే వారు, వివిధ రంగాలలో విధులు నిరహిస్తున్న మొత్తం 97 మందిని నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు  కేటాయించినట్లు తెలియజేశారు.

బదిలీ ప్రక్రియను అందరూ హోంగార్డుల నడుమ పార దరకంగా ఎటువంటి అపోహలు లేకుండా నిరహించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డిఎస్పీ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, రిజర్ ఇన్‌స్పెక్టర్లు నవీన్, మురళి, చంద్రశేఖర్, పోలీ సు కార్యాలయం సిబ్బంది సూపర్‌ఇండెంట్ సంజీవ్, సిబ్బంది, హోం గార్డ్ యూనిట్ అధికారులు రమేష్, రిజరు సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.