8 June, 2026 | 7:22 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

అంబులెన్స్‌లో గంజాయి రవాణా

16-09-2024 01:22 AM
  1. రూ.2 కోట్ల విలువైన సరుకు పట్టివేత 
  2. వివరాలను గోప్యంగా ఉంచుతున్న పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): గుర్తుతెలియని ప్రాంతం నుంచి కొత్తగూడెం జిల్లాకేంద్రం గుండా అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కానీ పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ అంబులెన్సులో దుండగులు గంజాయి తరలిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి పోలీసులు రామవరం వద్ద అంబులెన్స్ పంక్చర్ అయి నిలిచింది.

ముగ్గురు స్థానికులు విషయం తెలియకుండానే దుండగులకు సహకరించారు. ఈ క్రమంలో స్థానికులకు అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్నట్లు పసిగట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి అంబులెన్స్‌ను సోదా చేశారు. బండిలో సుమారు 2.50 నుంచి 3 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉన్నది.