8 June, 2026 | 7:30 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

08-06-2026 06:25 PM

* పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్

గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పారా క్రీడాకారులకు జీవో నెం.74 ప్రకారం కల్పించాల్సిన 2 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు,జాతీయ స్థాయి పారా వాలీబాల్ క్రీడాకారుడు కుర్ర గోపి యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పారా క్రీడాకారులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్ర స్థాయిలలో ప్రతిభ కనబరిచిన దివ్యాంగ క్రీడాకారులు ఉద్యోగ,ఉపాధి అవకాశాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.హైకోర్టు 2023లో స్పోర్ట్స్ కోటాలో పారా స్పోర్ట్స్‌ను చేర్చి 2 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించినప్పటికీ ఈనాటికి విడుదల చేయకపోవడం విడ్డూరం అన్నారు. ఇటీవల విడుదలైన ఏఈఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో పారా క్రీడాకారులకు తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం అన్యాయమని పేర్కొంటూ, సంబంధిత నోటిఫికేషన్లను తక్షణమే నిలిపివేసి జీవో నెం.74 ప్రకారం సవరణలు చేయాలని కోరారు.

అలాగే పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అర్జున అవార్డు గ్రహీత జీవాంజి దీప్తికి ప్రకటించిన గ్రూప్-2 ఉద్యోగ నియామకాన్ని ఇప్పటివరకు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 నియామకాల్లో కూడా పారా క్రీడాకారులు నష్టపోయారని, నిలిపివేసిన ఒక పోస్టును పారా స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద దివ్యాంగ క్రీడాకారులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెం.74 ప్రకారం 2 శాతం రిజర్వేషన్లను అమలు చేసి నష్టపోయిన పారా క్రీడాకారులకు న్యాయం చేయాలని,లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారా క్రీడాకారులతో కలిసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కుర్ర గోపి యాదవ్ హెచ్చరించారు.