8 June, 2026 | 7:02 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ

08-06-2026 06:08 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): నిత్యవసర వస్తువులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని 10న కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ ప్రజలను కోరారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో పెంచిన నిత్యవసర వస్తువులు డీజిల్ పెట్రోలు,వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ కరపత్రం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల10న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్,గ్యాస్ నిత్యవసర ధరలను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలి. బిజెపి పాలనలో సామాన్యుడు బతుకుబారంగా మారిందని డీజిల్,పెట్రోలు వంట గ్యాసు మరియు పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని అచ్చేదిన్ వస్తాయని చెప్పి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జేబుకు చిల్లులు పెడుతున్నారు.