8 June, 2026 | 7:09 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

08-06-2026 06:05 PM

ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలను కోరుతూ సోమవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తహాసిల్దార్ గణేష్ నాయక్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్ మాట్లాడుతూ... ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల అధిక ఫీజులతో విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు  రాష్ట్రంలో ఉన్నాయని వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు.

రాష్ట్రంలో లక్షలాదిమంది యువత ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీ ప్రక్రియ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదని దీంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో అధ్యాపక కొరత, మౌలిక సమస్యలతో విద్యాసంస్థలను బలహీనపరిస్తున్నాయన్నారు.

వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాలకు బదులుగా శాశ్వత ఉద్యోగాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ కార్యదర్శి బబ్బూరి శ్రీధర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కంబాల వెంకటేష్, గీతా పనివాళ్ల సంఘం మండల కార్యదర్శి గుండు వెంకటేష్,గోపగాని రాజు,ఏఐవైఎఫ్ మండల నాయకులు అనంతుల నరసింహ,రావుల శ్రీను, కంబాల రాజు తదితరులు పాల్గొన్నారు.