8 June, 2026 | 7:19 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా

08-06-2026 05:57 PM

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, 12వ వార్డు కౌన్సిలర్, కాసర్ల గోదావరి స్వామి

కామారెడ్డి,(విజయక్రాంతి): పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి అన్నారు. సోమవారం కామారెడ్డి 12వ వార్డు దేవునిపల్లిలో వార్డు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. పట్టణ ప్రజలు తడి చెత్త, పొడి చెత్త ,వేరు చేయడం, ఇంకుడు గుంతలు తవ్వుకోవడం చేపట్టాలని ప్రజలను కోరారు. డ్రైనేజీ పెన్షన్ దరఖాస్తుల ను స్వీకరించారు.

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, 12వ వార్డు సమస్యలపై చర్చించారు. 12వ వార్డు కౌన్సిలర్ గా గెల్పొందడం వల్లనే నేడు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైనట్లు తెలిపారు. వార్డు ప్రజల సమస్యలను నిరంతరం పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు,  వార్డు సూపర్వైజర్ లలిత, వార్డ్ ఆఫీసర్ వినయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ పోలీస్ కృష్ణాజి రావు,  ఆశా వర్కర్లు, డ్వాక్రా సంఘం లీడర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.